2023 – 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సర కన్యారాశి రాశీ ఫలాలు

Sree Shobhakruth Nama Samvatsara Kanya Rasi / Virgo Sign Free Telugu Rasi Phalalu

కన్యారాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అనగా 22-మార్చ్-2023 నుండ 08-ఏప్రిల్-2024 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఏర్పడును. 21-ఏప్రిల్-2023 ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా రక్త లేదా మెదడు సంబందిత ఆరోగ్య సమస్యలు తరచుగా బాధించును. అవివాహితులకు కూడా ప్రయత్నా అనుకూలత ఉండదు. జీవిత భాగస్వామి తో తీవ్ర తగాదాలు ఎదురగును. 22-ఏప్రిల్-2023 నుండి కుటుంబ పరమైన ఖర్చులు అధికం అవుతాయి. అదృష్టం కలసిరాడు. మొత్తం మీద కన్యరాశి వారికి సంవత్సరం అంతా గురు గ్రహం వలన ఎదో ఒక ఇబ్బంది ఉండును. తరచుగా బ్రాహ్మణునికి శనగలు దానం ఇచ్చుట మంచిది.

కన్యారాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో శనైచ్చరుని వలన కూడా అనుకూల ఫలితాలు ఏర్పడవు. సంవత్సరం అంతా శని కన్యరాశి రాశి వారకి ఎదో ఒక అసంతృప్తి ని కలుగచేయును. కన్యారాశి వారు నిత్యం శని గ్రహ స్తోత్రం పటించుట మంచిది. ” నీలాంజన సమా భాసం రవి పుత్రం యమాగ్రజం – ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైచ్చరం”. కన్యారాశి వారకి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.

కన్యారాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో రాహువు వలన కూడా అనుకూల ఫలితాలు ఏర్పడవు. సులువుగా పూర్తీ అవ్వవలసిన పనులకు కూడా అదృష్టం కలసి రాదు. ప్రతీ కార్యం కూడా కష్టం మీద పూర్తి అగును. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకూడదు. జీవిత భాగస్వామి పట్ల కటినతత్వం పనికిరాదు. స్వఆరోగ్య విషయాల పట్ల కూడా జాగ్రత్త అవసరం.

కన్యారాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కేతువు వలన కూడా ప్రతికూల ఫలితాలు ఏర్పడును. చిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలు తరచుగా ఏర్పడుచుండును. మొత్తం మీద కన్యారాశి వారికి రాహువు మరియు కేతువుల వలన ఈ సంవత్సరం కూడా అనుకూల ఫలితాలు ఏర్పడవు. వ్యక్తిగత జాతకంలో సర్ప దోషం కలిగిన వారు, రాహు-కేతువులను నీచ క్షేత్రములలో కలిగి ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండవలెను.

ఏప్రిల్ 2023 కన్యారాశి రాశిఫలాలు:

ఈ మాసంలో ఆరోగ్య సమస్యలు కొనసాగును. ఆశించిన స్థాయిలో కుటుంబం నుండి సహకారం ఉండదు. భాత్రువర్గం వారితో విరోధములు. స్థాన చలనం. మానసిక చాంచల్యత. 17, 18 తేదీలలో వాహన ప్రమాద సూచన. 20 వ తేదీ తదుపరి వృత్తి ఉద్యోగ వ్యపారాదులలో జయం. సౌకర్యం. అన్నివర్గముల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉండును.

See also  Top 5 quarterbacks with highest speed ratings in Madden NFL 23 ft. Lamar Jackson and Josh Allen

మే 2023 కన్యారాశి రాశిఫలాలు:

ఈ మాసం ప్రారంభంలో ధన వ్యయం అధికం. మానసిక అశాంతి. బంధువులతో వివాదం. ధన నష్టం వలన బాధ. ఋణాలు ఏర్పడు సూచన. అవిశ్రాంత శ్రమ. కొత్త విషయాలు అవగతమగును. తృతీయ వారంలో కర్యానుకులత. పనులు సకాలంలో పూర్తి అగును. ఉన్నతికి కారణమగు సంఘటనలు. వ్యాపార వ్యవహారములలో లాభములు. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యత. మాసాంతానికి ఖర్చులు అదుపులోకి వచ్చును.

జూన్ 2023 కన్యారాశి రాశిఫలాలు:

ఈ మాసంలో సంతానానికి సంబందించిన సమస్యలు పరిష్కారమగును. ఆర్ధిక పరమైన ఇబ్బందులు తొలగును. రావలసిన ధనం చేతికి వచ్చును. బంధు వర్గంతో సమస్యలు తొలగును. విద్యార్ధులకు విజయవంతమైన కాలం. నూతన బాధ్యతలు ఏర్పడును. గృహంలో ఆనందకరమైన కాలం. నూతన ఆదాయ మార్గాలున్నాయి. ఉద్యోగ జీవనంలో ప్రోత్సాహకర వాతావరణం. 22 నుండి 26 తేదీల మధ్య వృధా వ్యయం ఏర్పడు సూచన. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. వాహన చోదన విషయాలలో జాగ్రత్త అవసరం.

జూలై 2023 కన్యారాశి రాశిఫలాలు:

ఈ మాసంలో ఆరోగ్య విషయాలు మినహా అన్ని విధాల అనుకూలత ఏర్పడును. వ్యాపార వ్యవహారాలు, ఉద్యోగ అన్వేషణ, అవివాహితుల వివాహ ప్రయత్నాలు విజయాన్ని ఇచ్చును. మీ పట్ల గౌరవ అభిమానాలు పెరుగును. పుణ్య క్షేత్ర సందర్శన. ఆదాయం పెరుగును. ఆప్తుల సమాగమనం. అనుకున్న రీతిలో పనులు కొనసాగును. నూతన ఆలోచనలు కలసివచ్చును.

ఆగష్టు 2023 కన్యారాశి రాశిఫలాలు:

ఈ మాసం కూడా అనుకూలమైన ఫలితాలను ఇచ్చును. గృహ సంబంధ సంతోషాలు. ఆశించిన కోర్కెలు సిద్ధించును. ఆదాయం బాగుండును. ఉద్యోగ ఉన్నతి లేదా విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు విజయం. కృషి ఫలించును. 15 నుండి 25 వ తేదీ మధ్యకాలంలో పనులు అనుకున్న రీతిలో ముందుకు సాగవు. 25 వ తేదీ తదుపరి మానసికంగా తెలికపడుదురు. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ఈ మాసంలో 18,19,20 తేదీలు అనుకూలమైనవి కావు.

సెప్టెంబర్ 2023 కన్యారాశి రాశిఫలాలు:

ఈ మాసంలో సమస్యలు కలుగును. శ్రీ సుబ్రమణ్య ఆరాధన మంచిది. వ్యాపార ఉద్యోగ జీవనాలు అంత అనుకూలంగా ఉండవు. కుటుంబ సభ్యుల వలన మనఃస్థాపం. ధనం సమస్యగా మారును. కష్టంకు తగిన ఫలితం ఉండదు. పనులు వాయిదా పడుచుండును. నూతన పరిచయాలతో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం కూడా అంతగా సహకరించదు. నూతన ఆలోచనలు చేయుట, ఆర్ధికంగా పెట్టుబడులు పెట్టుట మంచిది కాదు. ఉద్యోగ జీవనంలో ఒత్తిడి, నూతన అవకాశములు చేజారుట వంటి సంఘటనలు.

See also  MVP Comp: Cam Newton vs Lamar Jackson

అక్టోబర్ 2023 కన్యారాశి రాశిఫలాలు:

ఈ మాసం ప్రధమ వారం అంత అనుకూలమైనది కాదు. చేపట్టిన పనులలో ఆటంకములు, అనుకోని విరోధాలు, మానసిక అశాంతి. 8 వ తేదీ తదుపరి కొంత అనుకూలత. ఆదాయం సామాన్యం. పనులలో వేగం. అధికారుల వలన ఏర్పడుతున్న సమస్యలు తొలగును. సంతాన సంబంధ విషయాలలో విజయం. తృతీయ వారంలో ప్రయాణాలు. అయినవారిని కలుసుకుంటారు. ఉన్నత విద్యాప్రవేశం. ఈ మాసంలో 5,6 తేదీలు అనుకూలమైనవి కావు.

నవంబర్ 2023 కన్యారాశి రాశిఫలాలు:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు. తెలిసిన వ్యక్తుల వలన లేదా నమ్మకస్తుల వలన ఒక నష్టం. మైత్రీ సంబంధ వ్యవహారాలలో అపజయం. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. ఉద్యోగ జీవనంలోని వారికి నూతన బాధ్యతలు. స్త్రీలకు గౌరవ హాని. పనులు చాలా ఆలస్యంగా పూర్తి చేయుదురు. హామీలు నేరవేర్చలేరు. ఆదాయ వ్యయాలు అదుపులో ఉండవు. ఇతరుల జోక్యం వలన చికాకులు. చివరి వారంలో జూదం వలన లేదా అనారోగ్యం వలన ధన వ్యయం.

డిసెంబర్ 2023 కన్యారాశి రాశిఫలాలు:

ఈ మాసంలో కూడా సమస్యలు కొనసాగును. కుటుంబంలో అసంతృప్తి. చేపట్టిన పనులలో ఆటంకముల తదుపరి విజయం. పితృ అనారోగ్యం. వ్యాపారులకు మాత్రం నిరుత్సాహం. ఏ విధంగానూ ఆశించిన సహకారం పొందలేరు. వ్యాపారంలో ఖర్చులు అధికం అగును. జీవిత భాగస్వామితో కలహాలు. ఈ మాసంలో 10,11,13.20,22 మరియు 29 తేదీలు అనుకూలమైనవి కావు.

జనవరి 2024 కన్యారాశి రాశిఫలాలు:

ఈ మాసంలో వ్యవహారములు కొద్దిగా అనుకూలంగా నడచును. విజయాలు పొందుదురు. మీ మీ రంగాలలో చక్కటి గుర్తింపు ఏర్పడును. నూతన స్నేహ వర్గాలు ఏర్పడును. సంబంధాలు విస్తరిస్తాయి. ఇతరులకు మీరు సలహాలు ఇవ్వవలసిన పరిస్టితులు. ద్వితీయ తృతీయ వారాలలో చిన్నపాటి అనారోగ్యం. విదేశీ జీవన ప్రయాణాలు ఫలిస్తాయి. ఈ మాసంలో నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు శుభకరం.

ఫెబ్రవరి 2024 కన్యారాశి రాశిఫలాలు:

ఈ మాసంలో విదేశీ ప్రయాణ ప్రయత్నాలు, స్థానచలన ప్రయత్నాలు, ఉద్యోగ మార్పు ప్రయత్నాలు, నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ ప్రయత్నాలు ఫలించును. ధనాదాయం బాగుండును. ప్రొత్సాహపూరిత కాలం. సంతోషకరమైన సమాచారం. కుటుంబంలో శుభకార్యాలు. నూతన వస్తు లాభములు. వ్యక్తిగత జీవనంలో సుఖం. ప్రణాళికాబద్ధమైన జీవనం. ధనయోగాలు. విద్యాసంబంధ ప్రయత్నాలు విజయం పొందును.

మార్చ్ 2024 కన్యారాశి రాశిఫలాలు:

ఈ మాసంలో ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆరోగ్య సమస్యలు తగ్గును. ఈ మాసంలో పట్టుదల వహించకూడదు. వివాహ ప్రయత్నాలలో ఆశాభంగములు. ద్వితీయ వారంలో సన్నిహిత వర్గాలతో సమస్యలు. మనసుకు కష్టం. తృతీయ చతుర్ధ వారాలలో నూతన పనులు, కార్యోన్ముఖత. సువర్ణ సంబంధ లాభాలు. ఈ మాసంలో 9, 10 ,11 తేదీలు అనుకూలమైనవి కావు.

  • మీ సంపూర్ణ వ్యక్తిగత జాతక ఫలితాలు…
  • కన్యారాశి స్వభావం…
  • ఉత్తర జన్మ నక్షత్ర స్వభావం…
  • హస్త జన్మ నక్షత్ర స్వభావం…
  • చిత్త జన్మ నక్షత్ర స్వభావం…
  • ఇతర రాశుల 2023 – 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశీఫలితాలు…
See also  Madden 20: How to go number one overall in Face of the Franchise

Comments are closed.
Ky Phu,Nho Quan,Ninh Binh, Viet Nam Country
+84.229 6333 111

BOOKING TEE TIME

[formidable id=8 title=true description=true]
Trang An Golf and Resort